కేతేపల్లి : కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన బాలికకు తల్లిదండ్రులు బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులు సోమవారం బాలిక ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి పనులు జరుగుతుండటంతో అధికారులు బాలిక తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేయడం చట్ట పరంగా నేరమని వారిని అవగాహన కల్పించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అంగీకరించి రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో తహసీల్దార్ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కళావతి, అశ్రిత, లక్ష్మణ్, శోభారాణి ఉన్నారు.
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
నకిరేకల్ : పట్టణంలో ఆది వారం రాత్రి సంతకు వచ్చిన వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో స్పృహతప్పి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ స్థానిక యువకుల సహాయంతో సదరు వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం అతడిని చికిత్సనిమిత్తం ప్రైవేట్ వాహనంలో నకిరేకల్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.


