పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ విద్యార్థులకు వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సతీష్‌కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ పిల్లి మహేష్, ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కనెక్ట్ డైరెక్టర్ జక్కా సురేష్‌రెడ్డి, శ్రీదేవి, సబీనా హెరాల్డ్, విద్యార్థులు పాల్గొన్నారు.
8న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్
నల్లగొండ టౌన్ : ఐఎంఏ ఆధ్వర్యంలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఐఎంఏ నల్లగొండ అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఉచిత స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఆయన పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. ఈ క్యాంపునకు సికింద్రాబాద్ లెనోవో సెంచరీ ఆస్పత్రి క్యాన్సర్ వైద్యులు ప్రపుల్‌కుమార్ హాజరవుతారని తెలిపారు. ఈ క్యాంప్‌ను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు రమేష్, ప్రవీణ్, విజయ్ కుమార్, మూర్తి, కీర్తి, వసంతకుమారి, ఈట రాజేశ్వరి, జార్జ్ ప్రవీణ్ పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
మర్రిగూడ : వైద్యులు, సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని తిరగండ్లపల్లి పల్లె దవాఖానను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను, వ్యాక్సినేషన్‌తో పాటు వాక్సిన్ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, వైద్యాధికారి డాక్టర్ శాలిని, డాక్టర్ దీపక్ ఉన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష
నల్లగొండ : ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష శనివారం ప్రశాంతంగా సాగింది. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 12,934 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 12,653 మంది పరీక్ష రాశారు. 281 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓ దస్రూనాయక్ పరిశీలించారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిల్ల మురళి అన్నారు. శనివారం టీఎన్‌జీఓ భవనంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాద బీమా, నగదు రహిత వైద్యం, హెచ్‌ఆర్‌ఏ కల్పించడం ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి జె. శేఖర్‌రెడ్డి, నర్సింహాచారి, వంగూరు విజయకృష్ణ, డి.ఐ.రాజు, లక్ష్మయ్య, బి.రణదీవె, డి.సైదులు నాయక్, కె. గోవర్ధన్‌రెడ్డి, పి.ఆంజనేయులు, కె.సునీత, రామచంద్రయ్య, వెంకటరెడ్డి, బిక్షం, షఫీ, ఖాసీం పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి


