ప్రభుత్వ ప్రోత్సాహాలను వినియోగించుకోవాలి
యాదగిరీశుడి శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజుస్వామి, అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాలు ఆలపిస్తున్న భక్తులు
శనివారం రాత్రి స్వామి, అమ్మవార్ల
శృంగార డోలోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్
రామగిరి(నల్లగొండ) : నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లోని దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. నార్కట్‌పల్లి మండలంలో నార్కట్‌పల్లి ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయ స్వామి చిట్యాల మండలం పేరుపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది.
శాలిగౌరారం : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వల్లాల గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రూ.92 వేల వ్యయంతో నిర్మించిన పశువుల పాకను శనివారం ఆయన పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీ్త్రశక్తి పథకంలో ఎస్‌హెచ్‌జీ నుంచి రూ.లక్ష రుణం పొంది కొనుగోలు చేసిన గేదెను నూతనంగా నిర్మించిన పశువుల పాకలోకి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల పాకను నాణ్యంగా నిర్మించిన యజమానిని, ఉపాధిహామీ టెక్నికల్ సిబ్బందిని అభినందించారు. అనంతరం గ్రామంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌ను తనఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో వంటలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, ఏపీఓ జంగమ్మ, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సర్పంచ్ భూపతి తిరుపతమ్మ ఉపేందర్ ఉన్నారు.
ఫ డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి
ప్రభుత్వ ప్రోత్సాహాలను వినియోగించుకోవాలి
ప్రభుత్వ ప్రోత్సాహాలను వినియోగించుకోవాలి


