గ్రామాల్లో వైద్య సేవలు అందించాలి
నల్లగొండ టౌన్ : వైద్యులు గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన వైద్య కళాశాల వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతంలో ప్రజలకు 75 శాతం నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గ్రామీణ ప్రాంతంలో కేవలం 35 శాతం వైద్యసేవలే అందుతున్నాయని తెలిపారు. ఎంబీబీఎస్ అంతం లేని చదువని భవిష్యత్‌లో పీజీ, స్పెషలైజేషన్‌కు ఉపయోగపడుతుందన్నారు. ఎంచుకున్న సబ్జెక్టుల్లో నిష్ణాతులు కావాలని, అందుకోసం బాగా కష్టపడి విజయాలు సాధించాలన్నారు. అంతకుముందు కాలేజీలో ఏర్పాటు చేసిన నూతన జిమ్ కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ, హెచ్‌ఓడీలు, మెడికోలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


