ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్‌ఫెయిర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్‌ఫెయిర్‌

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

ఆకట్ట

ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్‌ఫెయిర్‌

సూర్యాపేట టౌన్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఆదివారం జయ సృష్టి–2026 పేరుతో సైన్స్‌ఫెయిర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన బొమ్మల కొలువు, డెవిల్‌ హౌస్‌, హైడ్రాలిక్‌ మిషన్స్‌, పీఎస్‌ఎల్‌వీసీ 33, 37 నమూనాలు, సోలార్‌ ఎనర్జీ, ఫుడ్‌ కోర్టు, స్పేస్‌ రూమ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్‌ క్యాంపులో తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సైన్స్‌ఫెయిర్‌లో విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత హాజరై సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించి మాట్లాడారు. జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాసీ్త్రయ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్‌ఫెయిర్‌1
1/1

ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్‌ఫెయిర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement