యాదగిరీశుడి సేవలో త్రిపుర గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి సేవలో త్రిపుర గవర్నర్‌

Mar 1 2026 7:27 AM | Updated on Mar 1 2026 7:27 AM

యాదగిరీశుడి సేవలో త్రిపుర గవర్నర్‌

యాదగిరీశుడి సేవలో త్రిపుర గవర్నర్‌

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, కుటుంబ సభ్యులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవానీ శంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్న గవర్నర్‌ ఇంద్రసేనా రెడ్డి, కుటుంబ సభ్యులు.. ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చనమూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement