నల్లగొండ: గత పది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, కనిష్టంగా 20.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 15 తర్వాత 5 రోజులపాటు చల్లటి గాలులు వీచాయి. అనంతరం రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈసారి ఫిబ్రవరి 15 వరకు చలి తీవ్రతతో జనాలు ఇబ్బంది పడగా.. 20వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో పెరగాల్సి న ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారం నుంచే 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు కాటనన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. నూనె వస్తువుల కంటే చలువ చేసే ఆహార పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలని, పశువులను, మూగజీవాలను నీడ పట్టున ఉంచి, తగినంత నీటిని అందుబాటులో ఉంచాలని తెలియజేస్తున్నారు.
తేదీ గరిష్టం
24 30.5
25 30.0
26 31.0
27 32.0
28 31.5
01 32.0
02 32.5
03 33.0
ఉష్ణోగ్రత
(డిగ్రీల సెల్సియస్‌లో)
గత పది రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత
మంగళవారం 33 డిగ్రీల సెల్సియస్
ఉష్ణోగ్రత నమోదు


