విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం | - | Sakshi
Sakshi News home page

విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం

Mar 3 2026 7:23 AM | Updated on Mar 3 2026 7:23 AM

ఈసారి ముందే కోతలు..

న్యూస్‌రీల్‌

మదర్‌ డెయిరీకి పూర్వ వైభవం
మదర్‌ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

- 8లో

మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026

కామ దహనం

నాగార్జునసాగర్‌ : సాగర్‌లోని బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో నిర్వహించిన 3వ బుద్ధ దమ్మ యాత్ర ముగింపు వేడుకలకు కార్మికశాఖ మంత్రి వివేక్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం కల్బుర్గిలోని సిద్ధార్థ విహార్‌ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర శాంతి సందేశాన్ని చాటుతూ నాగార్జునసాగర్‌ తీరానికి చేరుకోవడం సంతోషదాయకమని చెప్పారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ నేల మన నాగరికతకు గర్వకారణమని, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి బుద్ధుడి బోధనలే పునాది అని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బౌద్ధవారసత్వ సంపదకు కొత్త జీవం పోస్తోందన్నారు. రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, దూలికట్ట వంటి చారిత్రక బౌద్ధక్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రపంచస్థాయి యాత్రా అనుభవాన్ని కల్పించేలా పర్యాటక సర్క్యూట్‌ ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. బుద్ధుడి బోధనలు యువతకు చేరువ చేసేందుకు ఇక్కడ ఒక ‘డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

బుద్ధుడి బోధనలు మార్గదర్శకం :

మంత్రి వివేక్‌

కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ మనిషి సాధారణ జీవితం గడిపేందుకు బుద్ధుడి బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. శాంతియుతంగా, ఆశావాద దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ చంద్రశేఖర్‌, సబ్‌కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, పర్యాటక శాఖ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి, గగన్‌మాలిక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గగన్‌మాలిక్‌, అక్షయ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హిట్టంబె, లతారాజా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కేకే.రాజా, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి బౌద్ధభిక్షువులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లాలో ఈ సారి ముందస్తుగానే వరి సాగు చేశారు. దీంతో కోతలు కూడా ముందే రానున్నాయి. దానికి అనుగునంగా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. గత యాసంగిలో ఏప్రిల్‌ 1న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అప్పటికే ముందస్తు కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని కల్లాలకు తెచ్చారు. కానీ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో రోజుల తరబడి కల్లాల వద్దే పడిగాపులు కాశారు. ఈసారి అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తుగానే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

నల్లగొండ : యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఎంత దిగుబడి వస్తుందన్న అంచనాలను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. అయితే దానికి అనుగుణంగా జిల్లాలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. వాటిలో చేయాల్సి ఏర్పాట్లపై ఇప్పటికే రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ సంబంధిత అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఉగాది పండుగ తర్వాత కేంద్రాలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు.

4.91 ఎకరాల్లో వరిసాగు

యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.91 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాని నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 2 లక్షల మెట్రిక్‌ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేస్తారని.. 8 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేశారు. అందుకోసం 350 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి కేంద్రాల సంఖ్య పెంచే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఏడు మిల్లులు ప్రస్తుతం బ్లాక్‌లిస్ట్‌లో ఆయా మిల్లుల పరిధిలో వచ్చే కేంద్రాల ధాన్యాన్ని ఏఏ మిల్లులకు పంపించాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రెండు కోట్ల గన్నీ బ్యాగులు అవసరం..

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 2 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని అధికారులు లెక్కలు వేశారు. ప్రస్తుతం 50 లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిల్లర్ల వద్ద ఉన్న గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలని ఇప్పటికే పౌర సరఫరాల అధికారులు సూచించారు. రేషన్‌డీలర్ల వద్ద ఉన్న గన్నీ బ్యాగులను కూడా పౌర సరఫరాల శాఖకే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

ఫ ఉగాది తర్వాత కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఫ ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్‌

ఫ 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా

ఫ గన్నీ బ్యాగులు సిద్ధం చేస్తున్న పౌరసరఫరాల శాఖ

ఫ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఫ సాగర్‌లో ముగిసిన దమ్మయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement