యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పేద రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై అందిస్తున్న యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఐదు మండలాకు చెందిన పలువురు రైతులకు సబ్సిడీపై మంజూరైనా కల్టివేటర్, రోటోవేటర్, పవర్ టిల్లర్లలతో తదితర వ్యవసాయ యంత్రాలను ఆదివారం మునుగోడులో వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూలీల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రైతులకు యంత్రాలను అందిస్తోందన్నారు. వాటిని వినియోగించుకొని ఆర్థికా భివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ వేణుగోపాల్, ఏఓ పద్మజ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


