ఉద్యోగులకు రెండో పీఆర్సీని అమలు చేయాలి
నల్లగొండ టూటౌన్ : ఉద్యోగులకు రెండో పీఆర్సీని అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అన్నారు. గురువారం నల్లగొండలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్‌తో 2023 జూలై 1 నుంచి పీఆర్‌సీని అమలు చేయాలని కోరారు. రిటైరైన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లీయర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లో ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాస్‌చారి, ఎడ్ల సైదులు, బడుగు అరుణ, వడిత్యా రాజు, మోర్తాల శ్రీనివాస్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, ఎ.చినవెంకన్న, కొమర్రాజు సైదులు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి


