‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ ద్వారా ఉచిత భోజనం | - | Sakshi
Sakshi News home page

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ ద్వారా ఉచిత భోజనం

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

‘మీల్

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ ద్వారా ఉచిత భోజనం

రాయచూరు రూరల్‌: నగరంలో మీల్స్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం ద్వారా అభాగ్యుల వద్దకే భోజనం సరఫరా చేస్తున్నారు. రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాల బోధన ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రోజూ 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. కోవిడ్‌ సమయంలో ప్రారంభమైన మీల్స్‌ ఆన్‌ వీల్స్‌ 900 రోజలు పూర్తి చేసుకుందని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ మీల్స్‌ ఆన్‌ వీల్స్‌ సభ్యులు గోవింద రాజ్‌, నాగరాజ్‌, రాజేంద్ర కుమార, పురుషోత్తమ, తిప్పణ్ణ, వీరణ్ణ, రాము, హేమణ్ణ, బసవరాజ్‌, దినేష్‌, మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

11, 12 తేదీల్లో

కంప్లి ఉత్సవాలు

హొసపేటె: కంప్లి పట్టణంలోని మున్సిపల్‌ హాలులో ఉత్సవా లోగో విడుదల కార్యక్రమం జరిగింది. వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, నాయకులు సమావేశంలో పాల్గొని పండుగను ప్రజా పండుగా మార్చడంపై ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎన్‌.గణేష్‌ మాట్లాడుతూ.. ఈనెల 11, 12 తేదీల్లో (రెండు రోజులు) ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరాల కంటే భిన్నంగా, వైవిధ్యంగా కంప్లి ఉత్సవాలు నిర్వహించాలని తీర్మానించడం జరిగిందన్నారు. కంప్లి ఉత్సవ్‌–మన ఊరి పండుగను అన్ని వర్గాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పండుగకు శాశ్వత రూపం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతాయన్నారు. కన్నడ భూమి, నీరు, సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఉత్సవంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ.. గ్రామీణ, జానపద కళలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మంజునాథ్‌, కన్నడ, సాంస్కృతిక శాఖ అధికారి నాగరాజ్‌, పురసభ అధికారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

డి.కే.శివకుమార్‌

సీఎం కావడం ఖాయం

రాయచూరు రూరల్‌: భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నోణవిన కెర కాడ సిద్ధేశ్వర స్వామి జోస్యం చెప్పారు. శనివారం రాత్రి నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్మషం లేని రాజకీయ దురందరుడు అయిన డీకే శివకుమార్‌కు కొన్ని దుష్టశక్తులు అడ్డు పడుతున్నాయన్నారు. త్వరలో సమస్యలన్నీ తీరిపోయి డి.కే.శివకుమార్‌కు మంచి కాలం రానుందన్నారు.

పోలీస్‌ కుటుంబానికి

చెక్కు వితరణ

హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఏఆర్‌ పోలీస్‌ యల్లప్ప మడివాళప్ప కుంబార కుటుంబానికి పోలీస్‌ శాలరీ ప్యాకేజ్‌ యోజన ద్వారా రూ.70 లక్షల చెక్కు అందజేశారు. జిల్లా పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గుంజన్‌ ఆర్య, హైర్‌ కామాండర్‌ రిటైర్డ్‌ చరణ్‌కుమార్‌ తినహా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ సేవలందించాలి

రాయచూరు రూరల్‌: రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ వైద్య సేవలందించాలని జిల్లా ఆర్యోగ కుటుంబ అధికారి సురేంద్రబాబు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం తాలుకాలోని మటమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయుష్మాన్‌ భారత్‌, ముఖ్యమంత్రి ఆరోగ్య కార్డుల ద్వారా ప్రభుత్వాస్పత్రి, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’  ద్వారా ఉచిత భోజనం 1
1/3

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ ద్వారా ఉచిత భోజనం

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’  ద్వారా ఉచిత భోజనం 2
2/3

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ ద్వారా ఉచిత భోజనం

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’  ద్వారా ఉచిత భోజనం 3
3/3

‘మీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ ద్వారా ఉచిత భోజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement