చేనేతలకు చేయూత ఏదీ?
రాయచూరు రూరల్: చేనేతలకు బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించాలని చేనేత సహకార సంఘం సంచాలకుడు సంగప్ప డిమాండ్ చేశారు. శనివారం బాగల్‌కోటె జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించి మాట్లాడారు. రాష్ట్రంలో కట్టడ కార్మికుల మాదిరిగా గుర్తింపు కార్డులు, సహకార, జాతీయ బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేసేలా చూడాలన్నారు. 55 ఏళ్లు పైబడిన చేనేతకారులకు నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ చెల్లించాలన్నారు. 55 మంది చేనేత కారులు రుణ బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సమ్మాన్ పథకం కింద ఉన్న నిధిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని కోరారు. చేనేత చట్టాన్ని జారీ చేయాలన్నారు. రైల్వే, విమానాశ్రయాల్లో చేనేత వస్త్రాల విక్రయాలకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.


