పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి | - | Sakshi
Sakshi News home page

పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి

పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి

రాయచూరు రూరల్‌: కర్ణాటక రాష్ట్రం ప్రవేశపెట్టిన పంచ గ్యారంటీలతో పేదలకు లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర పంచ గ్యారంటీల పథకం సమితి అధ్యక్షుడు హెచ్‌.యం.రేవణ్ణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాయచూరు జిల్లా ఏడెదొరె నాడు హబ్బను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్‌ నుంచి లభించే పథకాలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పంచ గ్యారంటీ పథకాల్లో శక్తి పథకం, యువ నిధి, గృహ జ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య పథకాలను సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్‌ పాటిల్‌, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్‌, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌, శాసన సభ్యులు బసన గౌడ, హంపన గౌడ, బసన గౌడ, వసంత్‌ కుమార్‌, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున, ఆర్‌డీఏ అధ్యక్షుడు రాజశేఖర్‌, పామయ్య, పవన్‌, డీసీ నితీష్‌, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ కాందూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement