మంగళకిరణ్‌కు కృషి పండిత్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

మంగళకిరణ్‌కు కృషి పండిత్‌ అవార్డు

Feb 7 2026 1:36 PM | Updated on Feb 7 2026 1:36 PM

మంగళకిరణ్‌కు కృషి పండిత్‌ అవార్డు

మంగళకిరణ్‌కు కృషి పండిత్‌ అవార్డు

హుబ్లీ: అత్యాధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తోటి మహిళ రైతులు, అన్నదాతలకు స్ఫూర్తినిస్తూ ఆదర్శంగా నిలిచిన గదగ్‌ జిల్లా ముళగుంద మహిళ ప్రగతి రైతు మంగళకిరణ నీలగుందకు రాష్ట్ర ప్రభుత్వం కృషి పండిత్‌ అవార్డు ప్రదానం చేసింది. గురువారం బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య మేళా–2026 ఉత్పాదానోత్తర వ్యవసాయ–రైతుల సాధికారత కార్యక్రమం జరిగింది. మంగళకిరణ్‌తో పాటు పలువురు రైతులకు సీఎం సిద్దరామయ్య డీసీఎం డీకే.శివకుమార్‌ తదితర ప్రముఖులు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంగళకిరణ్‌ మాట్లాడుతూ.. తనకు అండగా నిలుస్తున్న భర్త కిరణ్‌ నీలగుంద సహకరాలు మరవలేనివని తెలిపారు. రైతులు స్ఫూర్తి పొంది మేలైన సాగు పద్ధతులు పాటించి తగిన దిగుబడులు సాగిస్తే సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement