కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కూతురు | - | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కూతురు

Feb 11 2026 7:52 AM | Updated on Feb 11 2026 11:16 AM

ఓడిపో

ఓడిపోయిన కన్న ప్రేమ

రాష్ట్రంలో మతాంతర ప్రేమపెళ్లిళ్ల గొడవలు

యువతుల తల్లిదండ్రుల గుండెబరువు

బనశంకరి: బెంగళూరుతో సహా పలు జిల్లాలో మతాంతర ప్రేమ గొడవలు వెలుగులోకి వచ్చాయి. సయ్యద్‌ ఇంతియాజ్‌ అనే యువకుడు ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. బెంగళూరు బీటీఎంలే ఔట్‌ నివాసి ఇంతియాజ్‌.. సోషల్‌ మీడియలో కోల్‌కతాకు చెందిన హిందూ యువతిని పరిచయం చేసుకున్నాడు. ప్రేమపేరుతో మభ్యపెట్టాడు, ఆమెను మతం మార్చి జైనద్‌ అని పేరుపెట్టాడు. 2025 జూలై 18న బెంగళూరులో రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆమెకు ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డను కోల్‌కతాలో వదిలేసిన ఇంతియాజ్‌ పరారయ్యాడు. బాధితురాలు ఇక్కడకు వచ్చి మైకో లేఔట్‌ ఠాణాలో భర్త మోసంపై ఫిర్యాదు చేసింది.

యువతి పరారీ

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా సురత్కల్‌లో మొహమ్మద్‌ విద్లాజ్‌ అనే యువకునితో కలిసి వైశాలి (23) అనే యువతి పరారు అయ్యింది. కాసరగోడుకు చెందిన వైశాలి సురత్కల్‌లో ఓ కాలేజీలో చదువుతోంది. ఇద్దరూ ప్రేమలో పడి జనవరి 31న కేరళలోని వైనాడులో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు బీజేపీ నాయకులను సాయం కోరారు. వైశాలి తన పీజీ హాస్టల్‌ నుంచి ఫిబ్రవరి 9న వెళ్లిపోయింది. కూతురి కోసం కన్నవారు సురత్కల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

కాళ్లు పట్టుకున్నా.. కనికరించని కూతురు

సాక్షి, బళ్లారి: కన్నవారు ప్రాధేయపడినా కూతురు మాత్రం ప్రేమికునితో వెళ్లిపోయింది. విజయపుర నగరంలో ఓ యువతి, మహ్మద్‌ సలీమ్‌ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఈ నెల 2వ తేదీన తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి, సలీమ్‌ కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకొన్నామని పోలీసులతో చెప్పారు. తల్లిదండ్రులు కుమార్తెను బుజ్జగించారు, తమ వెంట రావాలని ఆమె కాళ్లమీద పడి ప్రాధేయపడినా ఆమె అవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. ఇది లవ్‌ జిహాదేనని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు.

 

ఓడిపోయిన కన్న ప్రేమ1
1/1

ఓడిపోయిన కన్న ప్రేమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement