పేదలకు ఏడాదిలో లక్ష ప్లాట్లు అందిస్తాం
హొసపేటె: రాష్ట్రంలో భూమి లేని వారికి వచ్చే ఏడాదిలోపు లే అవుట్లు నిర్మించి ప్లాట్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా ఇన్‌చార్జి, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా పంచాయతీ హాలులో ప్రస్తుత సంవత్సరం జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. 2021 సర్వే ప్రకారం రాష్ట్రంలో 36 లక్షల మంది భూమి లేనివారు ఉన్నారు. అటువంటి అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా ప్లాట్లు అందిస్తారన్నారు. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ పేరిట ఉన్న 24,000 ఎకరాల్లో ప్లాట్లు నిర్మించి దశల వారీగా భూమి లేని వారికి పంపిణీ చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ ఎన్‌టీ.శ్రీనివాస్, ఎంపీ లత మల్లికార్జున, కృష్ణనాయక్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఎన్.రూపేష్‌కుమార్, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అనుపమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్


