ఇకపై హంపీ ఉత్సవాలు నవంబర్‌లోనే
ఇకపై కూడా అదే మాదిరిగా ప్రతి ఏటా నవంబర్ నెలలోనే హంపీ ఉత్సవాలు జరుపుతామన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించేందుకు గ్యారెంటీ పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. విజయనగర చరిత్ర, గత పాలనా వైభవం అందరికీ తెలియజేసేందుకు హంపీ ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. మంత్రులు శివరాజ్ తంగడిగి, జమీర్ అహ్మద్ ఖాన్, హెచ్‌కే.పాటిల్ మాట్లాడుతూ హంపీ గొప్పతనాన్ని, విజయనగర పాలన వైభవాన్ని వివరించారు. వేదికపై ప్రముఖ కన్నడ సినీ నటుడు శివరాజ్‌కుమార్, విద్యారణ్య భారతీ స్వామీజీ, ఎమ్మెల్యేలు నాగేంద్ర, గవియప్ప, నారా భరత్‌రెడ్డి, నాగరాజు, లోక్‌సభ సభ్యుడు తుకారాం, జిల్లా అధికారి, ఎస్పీ పాల్గొన్నారు.


