ఏనుగు పట్టివేత
మైసూరు: జిల్లాలోని సరగూరు తాలూకా ఎన్.బేగూరు, మోళేయూరు అటవీ జోన్ పరిధిలోని 25కు పైగా గ్రామాల ప్రజలను, రైతులను వేధిస్తున్న అటవీ ఏనుగు పట్టుబడింది. ఏనుగు కోసం అటవీశాఖ అధికారులు పెంపుడు ఏనుగుల సహాయంతో కూంబింగ్ నిర్వహించారు. శుక్రవారం సరగూరు తాలూకా మఠదకట్టె సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా బంధించారు. క్రేన్‌ద్వారా లారీలోకి ఎక్కించి అటవీ ప్రాంతానికి తరలించారు. ఏనుగును బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యార్థిని బ్యాగులో పాము
మైసూరు: పాఠశాల విద్యార్థిని బ్యాగులో నాగుపాము ఒకటి ప్రత్యక్షమైంది. ఈ ఘటన మైసూరు ఇలవాల మధురానగరలో జరిగింది. ఆడుకునే సమయంలో బాలిక మైదానంలో బ్యాగును పెట్టింది. ఈ సమయంలో బ్యాగు లోపలకు పాము ఒకటి వచ్చి చేరింది. బ్యాగులో పామును చూసిన బాలిక కంగారుతో భయపడి కేకలు వేసింది. విషయం తెలిసిన వెంటనే స్నేక్‌శ్యామ్ అక్కడికి వచ్చి ఆ పామును క్షేమంగా పట్టుకున్నారు.
తల్లిని చంపిన కుమార్తె
● ఆస్తి గొడవలే కారణమని అనుమానం
తుమకూరు: కన్న తల్లిని హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. తుమకూరు తాలూకా అనుపనహళ్లిలో పుష్పావతి (55) హత్యకు గురైన మహిళ కాగా, ఆమెను సుచిత్ర(33) అనే కుమార్తె హత్య చేసింది. పుష్పావతి తన కుమార్తెతో కలిసి నగరంలోని శ్రీనగరలో నివాసం ఉంటోంది. రాత్రి పుష్పావతి నిద్రిస్తుండగా సుచిత్ర ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆమెను అంత్యక్రియలకు తీసుకెళ్లిన సమయంలో ఈ హత్య విషయం బయటపడింది. ముఖంపై గాయం గుర్తులు కనిపించాయి. అంత్యక్రియల సమయంలో పుష్పావతి సోదరుడు అనిల్ కుమార్ దీన్ని గమనించి అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యాత్సంద్ర పోలీసులు సుచిత్రను అరెస్టు చేశారు. చేతబడి చేయడం వల్ల తండ్రి చనిపోయాడని సుచిత్రకు కోపం ఉన్నట్లు, ఈ కారణంతోనే తల్లిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తండ్రి మరణం అనంతరం సుచిత్ర మానసికంగా కుంగిపోయింది. సుచిత్ర, పుష్పావతికి మధ్య తరచూ ఆస్తి గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే కన్నతల్లిని సుచిత్ర హత్య చేసినట్లు తెలుస్తోంది.
సీఎంపై సిఫార్సు లేఖ బాంబు
యశవంతపుర: సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ సిఫార్సు లేఖ బాంబు పేల్చారు. ఆరోగ్య శాఖ నుంచి ఎకై ్సజ్ శాఖకు ఓ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ సీఎం సిఫార్సు చేసిన లేఖను ఆయన బట్టబయలు చేశారు. ఈ విషయంపై ఆయన ఎక్స్‌లో ఆ లేఖను పోస్టు చేశారు. సీఎం సిద్ధరామయ్య పాలన గాడి తప్పిందనడానికి ఈ లేఖ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. మండ్య జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిని మైసూరు గ్రామీణ జిల్లా ఎకై ్సజ్ డీసీగా బదిలీ చేయాలని సీఎం స్వయంగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు.
యోగేష్‌గౌడ కేసులో
సీబీఐకి సుప్రీం నోటీసులు
హుబ్లీ: ధార్వాడలో బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఓ వారంలోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐకు సూచించింది. ఇటీవల ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ వినయ్ కులకర్ణి సుప్రీంకోర్టులో రిట్ వేశారు. ఆ రిట్‌పై విచారణ సందర్భంగా స్పందించిన సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వారంలోగా ప్రతిస్పందించాలని సూచించింది.
ఏనుగు పట్టివేత
ఏనుగు పట్టివేత


