యమస్పీడు.. తీసింది ప్రాణం | - | Sakshi
Sakshi News home page

యమస్పీడు.. తీసింది ప్రాణం

Feb 14 2026 7:24 AM | Updated on Feb 14 2026 7:24 AM

యమస్ప

యమస్పీడు.. తీసింది ప్రాణం

మృతుల వివరాలు

● అశ్విన్‌ నాయర్‌ (17), ఫస్ట్‌ పీయూసీ, ఆర్‌వీ పీయూ కాలేజీ, యలహంక, చిరునామా: కొత్తనూరు

● ఇథన్‌ (17), ఫస్ట్‌ పీయూసీ, ఆర్‌వీ పీయూ కాలేజీ, యలహంక, చిరునామా: హుళిమావు, హెణ్ణూరు రోడ్డు

● అహ్రామ్‌ షరీఫ్‌ (16), 10వ తరగతి, ఏఓకేహెచ్‌ పాఠశాల, చిరునామా: ఉగిఖా లేఅవుట్‌

● అయాన్‌ అలీ (17), 10వ తరగతి, ఆర్‌ఓఏ పాఠశాల, చిరునామా: కొత్తనూరు

● భరత్‌ (17), 10వ తరగతి, శోభన మెమోరియల్‌ స్కూల్‌, ఫ్రేజర్‌ టౌన్‌, చిరునామా: ఫ్రేజర్‌ టౌన్‌

● ఫర్హాన్‌ (18), చిరునామా: కమ్మనహళ్లి

● గగన్‌ (26), సఫూల్‌ మార్కెట్‌ సూపర్‌వైజర్‌, చిరునామా: దేవనాయకనహళ్లి, చెన్నరాయపట్న, (ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి)

కృష్ణరాజపురం: తెలిసీ తెలియని తనంతో బాలురు చేతిలోకి కారు స్టీరింగ్‌ తీసుకొని యమస్పీడుగా వెళ్లి మృత్యువాత పడ్డారు. జాలీ రైడ్‌ అంటూ వెళ్లి మృత్యువుకు చిక్కి తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమయ్యారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న బాలురు అర్ధంతరంగా తనువు చాలించడంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హొసకోటె శివార్లలో హొసకోటె, డాబస్‌పేటె మధ్య శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై కారు, బైక్‌, క్యాంటర్‌ మధ్య జరిగిన వరుస ప్రమాదాల్లో బెంగళూరు నగరానికి చెందిన కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు బాలురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తితో కలిసి మొత్తం ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో క్యాంటర్‌ వాహనానికి చెందిన మాలూరు తాలూకా సంతెహళ్లి గ్రామ నివాసి బాలసుబ్రమణ్యం (32) కూడా ఉన్నారు. మృతులందరూ హెచ్‌బీఆర్‌ లేఅవుట్‌, ఫ్రేజర్‌ టౌన్‌, హెణ్ణూరు, కొత్తనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ చదువుతున్నారు. తెల్లవారు జామున 1 గంట ప్రాంతంలో వారందరూ జాలీ రైడ్‌ కోసం తమ ఇళ్ల నుంచి కార్లలో బయలుదేరి వెళ్లారు. హొసకోటె, డాబస్‌పేటె జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హొసకోటె నుంచి వచ్చిన క్యాంటర్‌ వాహనం, సూలిబెలె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని. సత్యావర గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టి, ఆపై నియంత్రణ కోల్పోయి క్యాంటర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ వార్త అందిన వెంటనే సూలిబెలె స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం హొసకోటె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు క్యాంటర్‌ యాక్సిల్‌ పూర్తిగా కట్‌ అయి చక్రాలు విడిపోయి బోల్తా పడ్డాయి. కారు, బైక్‌ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.వరుస ప్రమాదాల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించాల్సిన వాహనాలను జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు నిలిపివేశారు. ఆ తర్వాత పోలీసులు క్రేన్‌ను ఉపయోగించి దెబ్బతిన్న వాహనాలను రోడ్డు నుంచి పక్కకు తరలించి వాహన రాకపోకలు పునరుద్ధరించారు.

ప్రమాదంలో చనిపోయిన బాలురు (ఫైల్‌)

హొసకోటె సమీపంలో జాతీయ

రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు

ఆరుగురు బాలురు, వ్యక్తితో సహా

ఏడుగురు అక్కడికక్కడే మృతి

యమస్పీడు.. తీసింది ప్రాణం1
1/7

యమస్పీడు.. తీసింది ప్రాణం

యమస్పీడు.. తీసింది ప్రాణం2
2/7

యమస్పీడు.. తీసింది ప్రాణం

యమస్పీడు.. తీసింది ప్రాణం3
3/7

యమస్పీడు.. తీసింది ప్రాణం

యమస్పీడు.. తీసింది ప్రాణం4
4/7

యమస్పీడు.. తీసింది ప్రాణం

యమస్పీడు.. తీసింది ప్రాణం5
5/7

యమస్పీడు.. తీసింది ప్రాణం

యమస్పీడు.. తీసింది ప్రాణం6
6/7

యమస్పీడు.. తీసింది ప్రాణం

యమస్పీడు.. తీసింది ప్రాణం7
7/7

యమస్పీడు.. తీసింది ప్రాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement