అరణ్యంపై విమానం సర్వే! | - | Sakshi
Sakshi News home page

అరణ్యంపై విమానం సర్వే!

Feb 11 2026 7:52 AM | Updated on Feb 11 2026 7:52 AM

అరణ్యంపై విమానం సర్వే!

అరణ్యంపై విమానం సర్వే!

దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లాలోని కళస, ఎన్‌ఆర్‌ పుర తాలూకా పరిధిలో దట్టమైన అరణ్య ప్రదేశంపై తేలికపాటి విమానం చాలాసేపు తిరగడం స్థానికులను విస్మయపరిచింది. భద్రానది తీరం మొత్తం ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌ పలు రౌండ్లు కొట్టింది. ఇది చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్లింది. కళస ప్రాంతం నుంచి వచ్చిన విమానం బాళెహొన్నూరు పరిసరాల్లో పలు రౌండ్లు కొట్టి శివమొగ్గ వైపు వెళ్లిపోయింది. తమకేమీ తెలియదని అటవీ, పోలీసు అధికారులు చెప్పారు. భూగర్భ గనుల సర్వే కోసం వచ్చి ఉంటాదని భావిస్తున్నారు.

ఎయిర్‌పోర్టు, వాయుసేన స్థావరంపై డ్రోన్‌

బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టుపై డ్రోన్‌ ఎగరేసిన యూట్యూబర్‌ నిర్వాకమిది. బెంగళూరుకు చెందిన వాంటర్లస్ట్‌ అనే యూట్యూబర్‌ 1వ టెర్మినల్‌ నుంచి యలహంక మీదుగా వాయుసేన స్థావరం వరకూ డ్రోన్‌ ఎగురవేసి వీడియో షూట్‌ చేశాడు. సుమారు 8 నిమిషాల వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో అప్లోడ్‌ చేసాడు. సదరు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్‌ ఎగరేసినందుకు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

ఎగురుతున్న

విమానం

చిక్కమగళూరు జిల్లాలో కలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement