అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
రాయచూరు రూరల్: అటవీ శాఖ ఉద్యోగి ఒకరు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన బీదర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. మృతుడిని బీదర్ జిల్లా భాల్కి తాలూకా బోళగావ్‌కు చెందిన అంకుశ్ సుధామ(57)గా పోలీసులు గుర్తించారు. అటవీశాఖ అధికారుల వేధింపులతో విసిగి ఆత్మహత్య చేసుకున్నట్లు దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో భాల్కి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి అటవీ శాఖ మంత్రి ఈఽశ్వర్ ఖండ్రె చేరుకుని మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా లభించే సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఎకై ్సజ్ మంత్రి రాజీనామా చేయాలి
రాయచూరు రూరల్: అవినీతి, అక్రమాల్లో భాగస్వాముడైన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖా మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ రాజీనామా చేయాలని బీదర్ జిల్లా బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం బీదర్ జిల్లాధికారి కార్యాలయం వద్ద వినితిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు సోమనాథ్ పాటిల్ మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రి ఆర్.బి.తిమ్మాపూర్ పుత్రులు మద్యం దుకాణాల లైసెన్సులకు రూ.6 వేలు లంచం తీసుకున ఆరోపణలు రుజువు కావడంతో మంత్రి తిమ్మాపూర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతూ ఎకై ్సజ్ శాఖ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.
పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదన వద్దు
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు విరమించుకోవాలని ఆందోళనకారులు విన్నవించుకున్నారు. శనివారం కొప్పళ నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ప్రాంతానికి రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌధరి విచ్చేసి మ హిళా ఆందోళనకారులతో చర్చించారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మనిషి జీవితాలను అనారోగ్యం పాలు చేయడం తగదని ఆందోళనకారులు వివరించారు. బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణి స్టీల్, ముక్కుంద సుమి, ఏక్రోస్ ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితమై మనిషి ఆయుష్షు క్షీణించడం, 18 గ్రామాలు వాటి బారిన పడి వినాశనానికి దారి తీసే పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందించారు. జ్యోతి మంజునాథ్, కావ్య ప్రసన్న శ్వేత, శశిరేఖ, పుష్పలతలున్నారు.
పగిలిన మంచినీటి పైప్‌లైన్
● పెద్ద ఎత్తున రోడ్డులో నీటి ప్రవాహం
● ఇళ్లలోకి నీరు, లోతట్టు జలమయం
సాక్షి,బళ్లారి: నగరంలో రోడ్లలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు ప్రవహించి, ఇళ్లలోకి చేరింది. భారీ వర్షం వల్ల నీరు చేరిందని అనుకుంటే పొరపాటు. బళ్లారి నగరానికి మంచినీటిని సరఫరా చేసే పైప్‌లైన్ పగిలింది. శుక్రవారం రాత్రి అల్లీపుర రిజర్వాయర్ నుంచి నగరానికి మంచినీరు సరఫరా చేసే పెద్ద పైప్‌లైన్ పగిలిపోవడంతో పార్వతీ నగర్‌లోని రోడ్లలో పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ఆ కాలనీ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్ పగిలినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. నీటి సరఫరాను నిలిపివేయడంతో రోడ్లులో నీరు రావడం ఆగిపోయింది.
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య


