ముండ్రిగి నాగరాజ్‌కు మంత్రి హోదా
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ప్రభుత్వం పలు నిగమ, మండళ్ల అధ్యక్ష స్థానాలకు మార్పులు, చేర్పులు చేయడంతో పాటు పలువురికి నిగమ మండలి అధ్యక్షులుగా కూడా అవకాశం కల్పించింది. బళ్లారి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, లిడ్కర్ అధ్యక్షుడుగా ఉన్న ముండ్రిగి నాగరాజుకు మంత్రి పదవి హోదా కల్పిస్తూ, అదే స్థానానికి అధ్యక్షుడుగా నియమించారు. దీంతో ముండ్రిగి నాగరాజు అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరిసింది. తాను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి మళ్లీ తనను లిడ్కర్ అధ్యక్షుడుగా కొనసాగేలా అవకాశం కల్పించడంపై నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కంప్లి ఎమ్మెల్యే గణేష్‌ను కావేరి నిగమ మండలి అధ్యక్షుడుగా నియమించారు.
లిడ్కర్ అధ్యక్షుడుగా కొనసాగింపు
కావేరి నిగమ మండలి అధ్యక్షుడుగా గణేష్


