విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు

Feb 7 2026 1:36 PM | Updated on Feb 7 2026 1:36 PM

విద్య

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు

మంటల్లో వాహనం దగ్ధం

ప్రయాణికులు, కండక్టర్‌, డ్రైవర్‌ క్షేమం

యశవంతపుర: విద్యుత్‌ స్తంభాన్ని బస్సు ఢీకొని మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన బెంగళూరు–తుమకూరు జాతీయ రహదారి –48లో శుక్రవారం జరిగింది. 40 మంది ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌తో కలిసి బెంగళూరు నుంచి కలబుర్గికి బయల్దేరిన బస్సు నెలమంగల తాలూకా హనుమంతపుర గేట్‌ వద్దకు రాగానే రోడ్డు మరమ్మతుల వల్ల వాహనం స్లో అయ్యింది. అదే సమయంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో డ్రైవర్‌ బస్సును ఆపాడు. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. అనంతరం మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికుల లగేజీ సైతం మంటల్లో కాలి బూడిదైంది. నెలమంగల ట్రాఫిక్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు 1
1/1

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement