గురురాఘవునికి ప్రత్యేక పూజలు
బనశంకరి: జయనగర ఐదో బ్లాక్‌లోని గురు రాఘవేంద్రస్వామి మఠంలో పరమపూజ్య 1008 సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల ప్రకారం మఠం సీనియర్ వ్యవస్థాపకుడు ఆర్‌కే.వాదీంద్రాచార్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పంచామృత అభిషేకం, కనకాభిషేకం, ప్రత్యేక అలంకరణ, మహామంగళ హారతి చేపట్టి భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం రథోత్సవం, గజవాహనోత్సవం, అష్టావధానం, ఊయలపూజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బావనూపుర నృత్యశాల గురువిదుషీ మీనాక్షీ ప్రసాద్ విద్యార్థుల బృందంచే నృత్యప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుందని నందకిశోర్ ఆచార్ తెలిపారు.


