మహానుభావుల సేవలు మరువలేనివి
సాక్షి బళ్లారి: మూఢ నమ్మకాలు, కుల వివక్ష, అసమాతలకు వ్యతిరేకంగా వచనాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి సమ సమాజ స్థాపన కోసం ఎందరో మహానుభావులు(శరణులు) పాటు పడ్డారని జిల్లా గ్యారంటీ పథకాల అమలు ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కేఈ.చిదానందప్ప తెలిపారు. మంగళవారం జెడ్పీ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కాయక శరణుల జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 12వ శతాబ్దంలో కుల వివక్ష, అసమానతలు, పక్షపాత భావనలు విస్తృతంగా ఉన్న సమయంలో ఎందరో మహానుభావులు సమ సమాజ అభివృద్ధికి కృషి చేశారన్నారు. మాదార చెన్నయ్య, సమగార అరళయ్య, మాదార గూళయ్య, డోహర కక్కయ్య తదితర మహానుభావులు, కాయక నిబద్ధతను, సమానత్వ సిద్ధాంతాలను చాటి చెప్పారన్నారు. బసవాది శరణులు ఎందరో పాటు పడ్డారని గుర్తు చేశారు. కన్నడ సంస్కృతి శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గ్యారంటీల అమలు సమితి
జిల్లా అధ్యక్షుడు చిదానందప్ప


