గోదాముల్లో అక్రమంగా యూరియా
సాక్షి,బళ్లారి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీతో అందించే వేలాది బస్తాల యూరియాను అధికారులు పట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతులు రోడ్లెక్కి ఆందోళన చేశారు. యూరియా లేక రైతులు ఎంతో ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే నగర శివార్లలోని గోదాముల్లో సుమారు నాలుగు వేల బస్తాల యూరియా అక్రమంగా నిల్వ ఉంచడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వేలాది బస్తాలు గోదాముల్లో నిల్వ ఉంచి, రైతులకు యూరియా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతుండటంతో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బ్లాక్ మార్కెట్‌లో బస్తా రూ.800
పోలీసులు చేసిన మెరుపుదాడిలో అక్రమంగా యూరియా నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. బ్లాక్ మార్కెట్‌లో బస్తా రూ.800 వరకు పెట్టి కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం సబ్సిడీలో రూ.266లకు బస్తా చొప్పున అమ్మాల్సిన యూరియాను ఎంతకు పడితే అంతకు అమ్మారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా, స్టాక్ లేదని చూపించి, అక్రమంగా అమ్మారని మండిపడ్డారు.
వేలాది బస్తాల యూరియా లభ్యం
నిల్వలపై అధికారుల మెరుపుదాడి
గోదాముల్లో అక్రమంగా యూరియా


