గ్రామీణ క్రీడలకు జేఎస్‌డబ్ల్యూ ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ క్రీడలకు జేఎస్‌డబ్ల్యూ ప్రోత్సాహం

Feb 7 2026 1:36 PM | Updated on Feb 7 2026 1:36 PM

గ్రామీణ క్రీడలకు జేఎస్‌డబ్ల్యూ ప్రోత్సాహం

గ్రామీణ క్రీడలకు జేఎస్‌డబ్ల్యూ ప్రోత్సాహం

సాక్షి బళ్లారి: గాదిగనూరులో శ్రీగురు రేవణ్ణ సిద్ధేశ్వర జాతరను పురస్కరించుకుని గాదిగనూరు యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌ మద్దతుతో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్ల నుంచి సుమారు 120 మంది గ్రామీణ యువకులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఫైనల్‌ మ్యాచ్‌లో కేజీఎఫ్‌ బాయ్స్‌ గాదిగనూరు, జీఆర్‌సీసీ బాయ్స్‌ గాదిగనూరు జట్లు పోటీపడ్డాయి. కేజీఎఫ్‌ బాయ్స్‌ గాదిగనూరు జట్టు అత్యత్తమ ఆటతీరుతో ప్రథమ బహుమతి దక్కించుకుంది. జీఆర్‌సీసీ బాయ్స్‌ గాదిగనూరు జట్టు ద్వితీయ బహుమతి దక్కించుకుంది. జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌ సమకూర్చిన ట్రోఫీలు, కప్‌లు, పతకాలను క్రీడాకారులకు అందజేశారు. గ్రామీణ ప్రాంత యువతకు క్రీడల్లో ఆసక్తిని పెంపొందించేందుకు క్రికెట్‌ టోర్నమెంట్లు దోహదపడుతాయని పలువురు తెలిపారు. కార్యక్రమంలో గాదిగనూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు శంకరప్ప నింగమ్మ, జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌ క్రీడా అధికారి మహమ్మద్‌ రఫీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement