సంబరంగా రాయచూరు హబ్బ | - | Sakshi
Sakshi News home page

సంబరంగా రాయచూరు హబ్బ

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

సంబరం

సంబరంగా రాయచూరు హబ్బ

ఊరేగింపులో నరసింహ స్వామి వేషధారణలో కళాకారులు

తలపాగాలతో ఊరేగింపులో పాల్గొన్న మహిళలు

ఊరేగింపులో పాల్గొన్న పగటివేషధారణ కళాకారులు

రాయచూరు రూరల్‌: నగరంలో మూడు రోజుల పాటు జరుగనున్న రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ పిలుపునిచ్చారు. గురువారం కర్ణాటక సంఘం కార్యాలయం వద్ద ఉత్సవాలకు శ్రీకారం చుట్టి ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను ఇంటింటి పండుగలా జరపాలన్నారు. రెండు దశాబ్దాల అనంతరం ఉత్సవాలు నిర్వహిస్తుండడం విశేషమన్నారు. రాయచూరు జిల్లాలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార విచారాలు, విభిన్న సంస్కృతి, కళలకు నిలయంగా మారిన జిల్లా తుంగభద్ర, కృష్ణా నదుల సంగమమని అన్నారు. మహిళా సమాజ్‌లో కవిగోష్టులు నిర్వహించారు. ఉత్సవాల్లో శాసన సభ్యులు శివరాజ్‌ పాటిల్‌, బసన గౌడ, జిల్లాధికారి నితీష్‌, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహపాత్రో, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణలున్నారు.

వ్యవసాయ మేళా అదుర్స్‌

గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మేళా– 2026 చూపరులను ఆకట్టుకుంది. జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్‌ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ ప్రారంభించారు. వ్యవసాయ మేళా తోరణం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, మినుములు, నువ్వులు, రాగులు, గోధుమ గింజలతో దేశ పటం, వాటర్‌ షెడ్‌ నమూనా, మత్స్య మేళా, ఇంటి గార్డెన్‌ మొక్కలు, ఆవులు, ఇతర ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు శివరాజ్‌ పాటిల్‌, బసన గౌడ దద్దల్‌, ఆర్డీఏ అధ్యక్షుడు రామస్వామి, పామయ్య మురారి, పవన్‌ తదితరులున్నారు.

జిల్లా ఉత్సవాలను

విజయవంతం చేయాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి

శరణ ప్రకాష్‌ పాటిల్‌

సంబరంగా రాయచూరు హబ్బ1
1/3

సంబరంగా రాయచూరు హబ్బ

సంబరంగా రాయచూరు హబ్బ2
2/3

సంబరంగా రాయచూరు హబ్బ

సంబరంగా రాయచూరు హబ్బ3
3/3

సంబరంగా రాయచూరు హబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement