ఉత్సాహంగా ఉద్యోగుల క్రీడా పోటీలు
హొసపేటె: ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్రీడలు సహాయకారి అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గౌడ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పరుగు పందెం, కబడ్డీ, యోగాసనాలు, వాలీబాల్, త్రోబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. యువజన సేవా, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేసీ, జిల్లా వ్యాయామ విద్యాధికారి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఉద్యోగుల క్రీడా పోటీలు


