చనిపోతూ నలుగురికి పునర్జన్మ
హుబ్లీ: బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి నలుగురికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలు.. విజయపుర జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దు మృతి చెందగా.. అతడి స్నేహితుడు బలరామ తీవ్రంగా గాయపడటంతో విజయపుర నగరంలోని బీఎల్‌డీఈ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు యువకుడి మొదడు దెబ్బతినడంతో బతకడం కష్టమని చెప్పారు. సదరు కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి అవయవ దానానికి అనుమతి తీసుకున్నారు. న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక అవయవ దానాన్ని ప్రారంభించిన ఆస్పత్రి వైద్యులు ఓ మూత్రపిండాన్ని కలబుర్గి ఆస్పత్రికి జీరో ట్రాఫిక్ ద్వారా తరలించారు. మరో మూత్రపిండాన్ని బీఎల్‌డీఈ ఆస్పత్రి రోగికి అమర్చారు. ఇతర అవయవాలు సరిపోని కారణంగా తీసుకోలేదు. అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు.


