వైభవంగా హిందూ సమాజోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హిందూ సమాజోత్సవం

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

వైభవంగా హిందూ సమాజోత్సవం

వైభవంగా హిందూ సమాజోత్సవం

కేజీఎఫ్‌ : ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌ సంఘ్‌ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తాలూకాలోని క్యాసంబళ్లిలో హిందూ సమాజోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో శోభాయాత్రను జరిపారు. వేదికపై కార్యక్రమాన్ని ప్రారంభించి శివాచార్య మహాస్వామి మాట్లాడుతూ దేశంపై అనేక దాడులు జరిగినా ఇంతవరకు హిందూ ధర్మం చెక్కు చెదరకుండా, దేశం ఇంకా సదృఢంగా ఉందన్నారు. దేశంలో అధికమైన చొరబాట్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కుల వ్యవస్థ వల్ల ధర్మానికి భంగం వాటిల్లక ముందే అందరం జాగృతమై సంఘటితం కావాలన్నారు. స్వదేశీ జాగరణ మంచ్‌ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సంఘటకుడు కె జగదీష్‌ మాట్లాడుతూ భారతీయులు దేశ అభివృద్ధి, పంచ పరివర్తన అంశాలైన సంరక్షణ, సామాజిక సామరస్యం, పరిసర నాగరిక క్రమశిక్షణ, స్వదేశీ చింతనలు అలవర్చుకోవాలన్నారు. మాజీ ఎంపీ ఎస్‌ మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే వై సంపంగి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement