హంపీ ఉత్సవాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

Feb 14 2026 7:24 AM | Updated on Feb 14 2026 7:24 AM

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

హంపీ ఉత్సవాలకు ఆహ్వానం

హొసపేటె: హంపీ ఉత్సవాలకు రావాలని హొసపేటె ఎమ్మెల్యే గవియప్పను జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ శుక్రవారం ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఇటీవల హంపీ ఉత్సవాల ఏర్పాటు పనుల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గవియప్ప కనిపించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ స్వయంగా ఎమ్మెల్యే గవియప్ప ఇంటికి వెళ్లి హంపీ ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

హోసూరు: భార్య కోపంతో కూతురు ఇంటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. హోసూరు పారిశ్రామికవాడ మూకొండపల్లి సమీపంలోని మత్తంఅగ్రహారం ప్రాంతానికి చెందిన కార్మికుడు శ్రీనివాసన్‌, కవిత దంపతులు నివసిస్తున్నారు. శ్రీనివాస్‌కు తాగుడు అలవాటు ఉండటంతో రోజూ మద్యం సేవించి ఇంటికెళ్లి భార్యతో గొడవపడేవాడు. నెల రోజుల క్రితం భర్త చిత్రహింసలు తాళలేక కవిత కూతురి ఇంటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాసన్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement