మా కూతుర్ని కాపాడండి | - | Sakshi
Sakshi News home page

మా కూతుర్ని కాపాడండి

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

మా కూతుర్ని కాపాడండి

మా కూతుర్ని కాపాడండి

లవ్‌ జిహాద్‌ కేసులో తండ్రి ఫిర్యాదు

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా సురత్కల్‌లో హిందూ యువతి వైశాలి, ముస్లిం యువకుడు మహమ్మద్‌ మిద్లాజ్‌ పరారైన ఘటన లవ్‌ జిహాదేనని యువతి తండ్రి విశ్వనాథ్‌ గురువారం మంగళూరులో ఆరోపించారు. తమ కూతురు లవ్‌ జిహాద్‌లో పడి మోసపోయిందని విలపించారు. దీని వెనుక ఎస్‌డిపిఐ సంస్థ హస్తం ఉన్నట్లు చెప్పారు. మిద్లాజ్‌ ఎస్‌డిపిఐ కార్యకర్త అన్నారు. ఎస్‌డిపిఐ నాయకులు మిద్లాజ్‌ తరఫున వయనాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లడమే నిదర్శనమన్నారు. తమ కూతురికి మత్తుమందులు ఇచ్చి, బ్రెయిన్‌ వాష్‌ చేసి తీసుకెళ్లాడన్నారు. విచారణ చేసి న్యాయం చేయాలని మనవి చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement