మిరప మేళా.. స్పందన భళా
హుబ్లీ: రైతులకు మంచి మార్కెట్, అలాగే వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఎండుమిర్చి అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఎండుమిర్చి మేళా ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్ర సాంబారు పదార్థాల అభివృద్ధి మండలి శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ 14వ మిర్చి మేళాను స్థానిక మూరు సావిరమఠం మైదానంలో ఏర్పాటు చేశారు. ధార్వాడ జిల్లాతో పాటు గదగ, బళ్లారికి చెందిన రైతన్నలు తమ మిర్చి పంటతో పాల్గొన్నారు. మొత్తం మీద పొలం నుంచి నేరుగా వినియోగదారుడి ముంగిటకు చేర్చే మేళా కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 100 దుకాణాల్లో బ్యాడగి డబ్బి, గుంటూరు, కడ్డిరకం, మిర్చి ఆకర్షిస్తున్నాయి.
ధరల హెచ్చుతగ్గులతో ఆసక్తికరం
100 స్టాళ్లలో మిరప ప్రదర్శనలు


