విజ్ఞానంతో జ్ఞాన వికాసం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో మానవుడి మెదడులో ఉన్న జ్ఞానం విజ్ఞానంతో వికాసం చెందుతుందని రాయచూరు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. గురువారం మాత్రుశ్రీ తపోవనంలో కసాప, బసవ సేవా ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానవుడిలో ఉన్న విషయాలు నేటి సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడంతో జ్ఞాన భండాగారం తరించి పోతుందన్నారు. మనపై విచారించకుండా మరొకరి గురించి మాట్లాడుకోవటం మానుకోవాలన్నారు. 1970లో కూడు, గూడు, దుస్తుల పట్ల ఆలోచించే వారన్నారు. నేడు బంధుత్వాలకు, పండుగలు, జాతరలకు విలువ లేదన్నారు. సమావేశంలో బసవరాజ్ స్వామి, అశోక్ కుమార్ జైన్, వాేసుదేవ్ మూర్తి, విజయ రాజేంద్ర, హులి, ఆంజనేయ, వెంకటరావ్, నాగప్ప, రేఖ, విరుపాక్షి, ప్రతిభ, రావుత్ రావ్, వెంకటేష్‌లున్నారు.


