యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో అక్రమ కట్టడాలు పెరిగి పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా అక్రమ మసీదులకు అంతే లేదు. అధికారులు అనుమతి ఇవ్వకున్నా రాత్రికి రాత్రే చాందసులు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మసీదుల నిర్మాణం చేపడుతున్నారు. బాగల్‌కోటె నవనగర్‌లో ఆల్మట్టి డ్యాం నిర్వాసితుల పునరావాసం కోసం కేటాయించిన స్థలంలో అక్రమంగా మసీదు నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకు ఈ అక్రమణలు అధికమవుతున్న నేపథ్యంలో హిందువుల ఆలయాల నిర్మాణానికి కూడా తగిన న్యాయం చేయాలని నిరసన ప్రారంభించారు. ఆల్మట్టి డ్యాం కోసం సర్వం కోల్పోయిన వారి స్థలాలు అధిక ధరలకు విక్రయించి అక్కడ టిన్‌షెడ్లు వేసి మసీదులు కడుతున్నారు. ఈ విషయంలో బాగలకోటె నగరసభ అధికారులు విచారణ చేపట్టారు. హిందూ ఆలయాల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ నగరసభ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.


