రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ కోతల్లేవు.!
రాయచూరు రూరల్: రాష్ట్రంలో 2025–26లో విద్యుత్ కోతలకు అవకాశం లేకుండా అధికంగా 1100 మె.వా.విదు్‌య్‌త్ ఉత్పత్తి కొనసాగుతుంది. గత ఏడాది అధిక భాగం వర్షాలు కురవడంతో ప్రధాన జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉష్ణ, సోలార్, గాలిమరల విద్యుత్ ఉత్పత్తి అధికంగా కొనసాగుతోంది. ప్రతి నిత్యం 33 దశలక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. 2024లో తీవ్ర విద్యుత్ క్షామం నెలకొంది. 2024–25లో 29,634 మె.వా. విద్యుత్ ఉత్పత్తి, 2025–26లో 30,733 మె.వా.విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రతి రోజు 15,715 మె.వా.విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ ఉంది. 2026 జూలై వరకు విద్యుత్ కోత సమస్య ఉండదని కేపీసీఎల్ అధికారులు తెలిపారు. రాయచూరు, యరమరస్, బళ్లారి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నుంచి ఉత్పత్తి కొనసాగుతోంది.
1100 మె.వా. విద్యుదుత్పత్తి అధికం


