అలరించిన క్రీడా మేళా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వ్యవసాయ విశ్వ విద్యాలయం క్రీడా మైదానంలో క్రీడా మేళాకు శ్రీకారం చుట్టారు. కుస్తీ, శ్వాన ప్రదర్శనలను చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ ప్రారంభించారు. 30 జాతులకు చెందిన వందకు పైగా శునకాలను ప్రదర్శించారు. మహిళల కుస్తీ పోటీలను జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కూమార్ కాందూ పారంభించారు. అనంతరం నిర్వహించిన యక్షగాన ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళల దాస సాహిత్య వేదికలో దాసుల, మాద్యమ, ఇతర అంశాలపై చర్చ గోష్టులు నిర్వహించారు. రాక్షస సంహరం పాత్రలో యువకుడు ప్రేక్షకులను అలరించాడు. అనంతరం ఇసుక బస్తాల పోటీలు నిర్వహించారు. కసభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, డీసీ నితీష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, నగర నభ కమిషనర్ జుబీన్‌మెహ పాత్రో, బడిగేర, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన క్రీడా మేళా
అలరించిన క్రీడా మేళా


