వేమగల్‌–బెంగళూరు బస్సు సర్వీస్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వేమగల్‌–బెంగళూరు బస్సు సర్వీస్‌ ప్రారంభం

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

వేమగల

వేమగల్‌–బెంగళూరు బస్సు సర్వీస్‌ ప్రారంభం

కోలారు: తాలూకాలోని వేమగల్‌ ఫిర్కా కేంద్రం నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసును గురువారం మాజీ విధాన పరిషత్‌ సభాపతి వి.ఆర్‌.సుదర్శన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేఎస్‌ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. మార్చి నెల అనంతరం ఆవశ్యకత ఉన్న ప్రాంతాలకు బస్సులు నడపాలని సూచించారు. రాబోయే రోజుల్లో వేమగల్‌ నుంచి విజయపుర, యలహంక అంతర్జాతీయ విమానాశ్రయం, విధానసౌధ మార్గంగా బెంగళూరుకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాలూకా గ్యారెంటీ సమితి అధ్యక్షుడు వీ.ఎం.మునియప్ప, వేమగల్‌ నరసాపుర ప్రాధికార అధ్యక్షుడు ఉరటి అగ్రహార చౌడరెడ్డి, వేమగల్‌ కురుగల్‌ పట్టణ పంచాయతీ సభ్యురాలు దీపా వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఉద్యోగి మృతి

హోసూరు: సరుకు తరలిస్తున్న వాహనాన్ని బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా ఉళ్లుగురికి గ్రామానికి చెందిన అశోక్‌ (25) తన మిత్రుడు నల్లరాళ్లపల్లికి చెందిన దిలీప్‌తో కలిసి బుధవారం ద్విచక్ర వాహనంలో రాయకోట వైపు వెళ్తున్నారు. తిమ్మనహళ్లి వద్ద ముందు వెళ్తున్న సరుకు వాహనాన్ని వీరు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిలీప్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అశోక్‌ను స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయకోట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

గంజాయి స్వాధీనం

మాలూరు: గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న కేసులో రాష్ట్ర ధ్వని యూట్యూబ్‌ చానల్‌ విలేకరి నారాయణ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.50 వేలు విలువ చేసే 520 గ్రాముల గంజాయి, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాలూకా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ సమయంలో హొసకోటె నుంచి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు. వాహనం నడుపుతున్న నిందితుడు వేణుగోపాల్‌, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో గంజాయిని మడివాళ గ్రామానికి చెందిన యూట్యూబ్‌ చానల్‌ విలేకరి నారాయణస్వామి తీసుకుని బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో యూట్యూబ్‌ చానల్‌ విలేకరి నారాయణ స్వామిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

వీధి కుక్కల దాడిలో

పలువురికి గాయాలు

మాలూరు: నగరంతో పాటు తాలూకాలోని వివిధ గ్రామాల్లో ఒకే రోజు కుక్కల దాడిలో ఆరుగురు గాయపడ్డారు. ఒకే కుక్క నాలుగు గ్రామాల్లో 5 మందిని కరిచింది. గ్రామస్తులు కుక్కను వెంటాడి చంపేశారు. మాస్తి ఫిర్కా దొడ్డకల్లహళ్లి గ్రామంలో పిచ్చికుక్క కెంపమ్మ, ప్రభాస్‌లను కరిచి తీవ్రంగా గాయపరిచింది. వీరికి మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కోలారు ఆర్‌.ఎల్‌.జాలప్ప ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా దొడ్డ ఇగ్గలూరు గ్రామంలో కదిరప్ప అనే వ్యక్తిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. నెల్లహళ్లి గ్రామంలో ఇంద్రమ్మ, మణిశెట్టిహళ్లి గ్రామంలో దయానంద్‌ కుక్క దాడిలో గాయపడ్డారు. వీరికి మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అలానే నగరంలో కూడా ఓ వ్యక్తిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.

విరగబూసిన మామిడి పూత

హోసూరు: ఈ ఏడాది మామిడి పూత విరగబూసింది. మామిడి సాగులో క్రిష్ణగిరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి రైతులు పండించే మామిడి ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. క్రిష్ణగిరి జిల్లాలో వేలాది హెక్టార్లలో పెద్ద ఎత్తున రైతులు మామిడి సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకపోతే కాపు బాగుంటుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాదిగా నష్టపోయిన మామిడి రైతులకు రెండు రోజుల క్రితం క్రిష్ణగిరి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మంత్రి పరిహారం అందజేశారు.

వేమగల్‌–బెంగళూరు  బస్సు సర్వీస్‌ ప్రారంభం1
1/2

వేమగల్‌–బెంగళూరు బస్సు సర్వీస్‌ ప్రారంభం

వేమగల్‌–బెంగళూరు  బస్సు సర్వీస్‌ ప్రారంభం2
2/2

వేమగల్‌–బెంగళూరు బస్సు సర్వీస్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement