సంస్థకు, సొంతూరికి మంచి పేరు తేవాలి
బళ్లారిఅర్బన్: సంస్థకు, సొంత ఊరికి మంచి పేరు తేవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక లాడ్స్ ఇండో అమెరికన్ పీయూ కళాశాల ఆధ్వర్యంలో ద్వితీయ పీయూ విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చారు. ముఖ్య అతిథిగా సెయింట్‌జాన్స్ జూనియర్ కళాశాల అధ్యక్షుడు, ప్రిన్సిపాల్ శివరామ పాల్గొని మాట్లాడారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఇండో అమెరికన్ విద్యా సంస్థలో చదవడం గొప్ప వరం అన్నారు. విద్యార్థులు తమ భావి జీవితానికి పునాది అయిన పీయూసీకి వీడ్కోలు చెప్పడం, ఉన్నత విద్యాభ్యాసం వైపు అడుగులు వేయడంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలన్నారు. కీలకమైన డిగ్రీ, పీజీ దశలను చేరుకుని కన్న తల్లిదండ్రులకు, సొంత ఊరితో పాటు విద్యా సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా వక్తలు కృత్రిమ మేధతో పాటు సైబర్ క్రైం, ఇతర సమాజంలోని సాధక బాధకాలు, తదితర చైతన్య పరిచే అంశాల గురించి వివరించారు. ప్రముఖులు డ్యానియల్, ఎం.శ్రీశైల, పీహెచ్.నాయుడు, ప్రిన్సిపాల్ రాజేష్, షేక్ సలీం బాషా, సుధీర్‌కుమార్, ఉదయ్ భాస్కర్‌లతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థకు, సొంతూరికి మంచి పేరు తేవాలి


