పోస్టర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ విడుదల

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

పోస్ట

పోస్టర్‌ విడుదల

హుబ్లీ: నిరాశ్రయులకు ముఖ్యంగా నానా రోగాలు, ఎన్నో సమస్యలతో వీధి పాలైన నిర్భాగ్యులకు పట్టెడన్నం పెట్టి సేద తీర్చే కరియప్ప శిరహట్టి, సునంద దంపతులు నగరంలో మరింతగా తమ సేవలను విస్తరించడానికి కృషి చేస్తున్నారు. తాజాగా గదగ్‌ జిల్లా లక్ష్మేశ్వరలో కూడా శివాజీ అన్న జోళిగె పేరుతో నిర్భాగ్యులకు, ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడానికి ఓ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్రముఖులు, దాతలు తదితరుల సహాయాన్ని ఈ దంపతులు అర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చంద్రనాథ్‌నగర్‌లో స్థానిక ప్రముఖులు రాఘవేంద్ర బోగి పరివార్‌ నుంచి పోస్టర్‌ను ఆవిష్కరింపచేశారు. కరియప్ప మాట్లాడుతూ తమ స్వగ్రామం లక్ష్మేశ్వరలో నిరంతరంగా పేదలకు క్షుద్బాధ తీర్చాలన్న సత్సంకల్పంతో శ్రీశివాజీ అన్నజోళిగె అనే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతామన్నారు.

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

రాయచూరు రూరల్‌: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సింధనూరులో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడిని తాలూకాలోని ఏళురాగి క్యాంప్‌ నివాసి దూద్‌ పాషా (25)గా గుర్తించారు. దూద్‌ పాషా సింధనూరులోని మహబూబియా కాలనీలో అద్దె ఇంట్లో ఉండేవాడని, అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని డీఎస్పీ చంద్రశేఖర్‌ తెలిపారు. ఘటనపై సింధనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పర్యాటక రంగానికి పెద్దపీట

రాయచూరు రూరల్‌: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించి, ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగమేశ్వర శివాచార్య, ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత అభిప్రాయపడ్డారు. బుధవారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో హెలికాప్టర్‌ రైడ్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాధికారి నితీష్‌, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, ఎస్పీ అరుణాంగ్షుగిరి, ఏడీసీ శివానంద, ఏసీ హంపన్న, నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, డీడీపీఐ బడిగేర్‌, ఈరణ్ణ, తహ సీల్దార్‌ సురేష్‌ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్ర శేఖర్‌రెడ్డి, రవిలున్నారు.

అవి రాజకీయ ఉత్సవాలా?

రాయచూరు రూరల్‌: జిల్లాలో మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలను రాజకీయ ఉత్సవాలుగా చిత్రీకరించడం తగదని కాంగ్రెస్‌ పార్టీ వెనుక బడిన వర్గాల ప్రధాన కార్యదర్శి టీ.మారెప్ప అభిప్రాయపడ్డారు. బుధవారం రాయచూరులో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతియాత్ర, రథయాత్ర, పిల్లల పండుగ, మావినకెరె చెరువు వద్ద విజ్ఞాన ప్రదర్శనలకు కొడగు జిల్లా ఇంచార్జి మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్‌ పుత్రుడు రవి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అధికారులు మద్ద తు పలకడం చూస్తే రాజకీయ ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లుగా ఉందని ఆరోపించారు.

ప్లాస్టిక్‌ రహిత జీపీకి సహకరించండి

మాలూరు: సొసగెరె జీపీ సమీపంలోని ఆర్‌ కార్గో ముందు నిర్మించిన ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్‌, నూతన స్వచ్ఛ సంకీర్ణాన్ని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నగరసభ వ్యాప్తికి సుమారు రూ.5.50 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కూడిన వ్యర్థాల నిర్వహణ విభాగం, నూతన స్వచ్ఛ సంకీర్ణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షురాలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రధ్ధలతో పెద్దపల్లి గంగమ్మ జాతర

కేజీఎఫ్‌ : పురాతన ప్రసిద్ధ పెద్దపల్లి గంగమ్మ జాతర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి రథోత్సవాన్ని జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. రథోత్సవం ప్రారంభం కాగానే భక్తులు రథంపైకి పూలు, పండ్లు విసిరి తమ మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అమ్మవారికి గొర్రెలు, మేకలను బలి ఇచ్చారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

పోస్టర్‌ విడుదల 1
1/3

పోస్టర్‌ విడుదల

పోస్టర్‌ విడుదల 2
2/3

పోస్టర్‌ విడుదల

పోస్టర్‌ విడుదల 3
3/3

పోస్టర్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement