నేటి నుంచి జిల్లా ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జిల్లా ఉత్సవాలు

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

నేటి

నేటి నుంచి జిల్లా ఉత్సవాలు

రాయచూరు రూరల్‌: జిల్లా కేంద్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శ్రీకారం చుడతారని జిల్లాధికారి నితీష్‌ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాల జ్యోతియాత్ర, రథయాత్రలు సాయంత్రం కర్ణాటక సంఘం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో వేదికలపై ఉత్సవాలకు శ్రీకారం చుడతారన్నారు. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, మాన్వి, సింధనూరు, ముదగల్‌, మస్కి, సిరవార, కవితాళ, హట్టి ప్రాంతాల నుంచి లక్ష మంది పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్‌ పాటిల్‌, బోసురాజ్‌, శాసన సభ్యులు పాల్గొంటారని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణలున్నారు.

జిల్లా ఉత్సవాలకు గట్టి పోలీస్‌ బందోబస్తు

గురువారం నుంచి మూడు రోజుల పాటు రాయచూరు జిల్లా ఉత్సవాలకు గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడెదొరెనాడు రాయచూరు జిల్లా ఉత్సవాలు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో వేదిక వద్ద ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. 150సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. 8 మంది సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, మూడు కేఆర్పీఎస్‌ బెటాలియన్‌, 500 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, హోంగార్డులను నియమించారు. మూడు రోజుల పాటు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

శ్రీకారం చుట్టనున్న డీసీఎం

నేటి నుంచి జిల్లా ఉత్సవాలు1
1/1

నేటి నుంచి జిల్లా ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement