టూరిస్టు బస్సు బోల్తా
హొసపేటె: పొరుగున ఉన్న కేరళ రాష్ట్రం విద్యార్థులు బస్సులో హంపీ వీక్షణకు వస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన బుధవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జాతీయ రహదారిపై జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లా గురువాయూర్‌లోని శ్రీకృష్ణ కళాశాలకు చెందిన ఒక ప్రొఫెసర్, 10 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, విద్యార్థినులతో కలిసి హంపీ, దాండేలి, గోకర్ణకు విహారయాత్రకు వెళ్లారు. వారు మంగళవారం ఉదయం 10 గంటలకు గురువాయూర్ నుంచి రైలులో బయలుదేరి మంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బస్సులో హంపీకి బయలుదేరారు. డ్రైవర్ అదుపు తప్పి బస్సు ఉదయం 5 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో ప్రొఫెసర్ లక్ష్మి కాలుకు తీవ్ర గాయమైంది. అతుల్య, అవని, అతుల్, అజయ్‌రాజ్, అనుగ్రహ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారికి కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని బీఎంసీఆర్‌సీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
ఐదుగురికి తీవ్ర గాయాలు
త్రుటిలో తప్పిన ప్రమాదం


