రోడ్డుపై చెత్త పారేస్తే ఖబడ్దార్‌.! | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై చెత్త పారేస్తే ఖబడ్దార్‌.!

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

రోడ్డ

రోడ్డుపై చెత్త పారేస్తే ఖబడ్దార్‌.!

సాక్షి,బళ్లారి: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తోడు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో డబ్బులు గుంజడంపై పలు ఆస్పత్రి యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నారే కాని స్వచ్ఛత గురించి పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ముందే చెత్తా చెదారం వేస్తూ నగర స్వచ్ఛతకు తీవ్ర అడ్డంకి కలిగిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై పాలికె తగిన బుద్ధి చెప్పింది. ప్రతి రోజు ఆస్పత్రి ముందు చెత్త వేస్తూ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పాలికె సిబ్బంది వాహనాల్లో చెత్త తీసుకొచ్చి వారి ఆస్పత్రుల ముందు మరింత చెత్త వేసి ఆస్పత్రి తీరును ఎండగట్టారు. నగరంలోని పార్వతీ నగర్‌లోని పద్మావతి కిడ్నీ కేర్‌ ఆస్పత్రి, బసవేశ్వరనగర్‌ రోడ్డులోని శాంతాసీతారాం ద్వారకా ఆస్పత్రి సిబ్బంది ప్రతి రోజు వారి ఆస్పత్రుల ఎదుట రోడ్డులో ఎక్కడబడితే అక్కడ చెత్తను పారవేసి చేతులు దులుపుకుంటుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అపరిశుభ్రతపై నగరవాసుల బేజారు

ఇది స్టీల్‌ సిటీనా లేక చెత్త సిటీనా అన్న విధంగా నగర వాసులు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. పాలికె సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో బుధవారం మహానగర పాలికె మేయర్‌ గాదెప్ప, పాలికె కమిషనర్‌ మంజునాథ్‌ దిశానిర్దేశంతో పాలికె సిబ్బంది ఆయా ఆస్పత్రులు ముందు చెత్తాచెదారం వేసి ఆస్పత్రి యాజమాన్యానికి కళ్లు తెరిపించారు. నగరంలో ఏ ఆస్పత్రి అయినా, ఇళ్ల ముందు అయినా పదే పదే రోడ్డులో చెత్తా చెదారం వేస్తే పాలికె నుంచి పెద్ద పెద్ద వాహనాల్లో వారి ఇళ్లు, ఆస్పత్రులు ముందు తామే చెత్తాచెదారం వేస్తామని, అప్పుడు వారికి ఆ బాధ తెలిసి వస్తుందన్నారు. నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే స్వచ్ఛత కాపాడుకునేందుకు వీలవుతుందన్నారు. ఎవరికి వారు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తే స్వచ్ఛత కాపాడేందుకు వీలుకాదన్నారు.

పరిశుభ్రతను పట్టించుకోని

ఆస్పత్రుల ముందు చెత్త పారేసిన వైనం

నగర స్వచ్ఛతకు సహకరించాలని

పాలికె యంత్రాంగం మనవి

రోడ్డుపై చెత్త పారేస్తే ఖబడ్దార్‌.!1
1/1

రోడ్డుపై చెత్త పారేస్తే ఖబడ్దార్‌.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement