వికటించిన మధ్యాహ్న భోజనం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా జమలాపూర్‌లో చోటు చేసుకుంది. సమాచారం అందగానే బీదర్ జిల్లాధికారి శిల్పాశర్మ హుటా హుటిన ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో అధికారులపై మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు అధికంగా తాలూకాలో జరిగాయని ఔరాద్ శాసన సభ్యుడు ప్రభు చౌహాన్ ఆరోపించారు. జిల్లా, తాలూకా విద్యాశాఖాధికారులు, అక్షర దాసోహ అధికారులు విధి నిర్వహణలో చేస్తున్న అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల క్షేమ సమాచారాన్ని విచారించారు. వారి వెంట జెడ్పీ అధికారి గిరీష్ బదోలె, తహసీల్దార్ మహేష్ పాటిల్, ఆరోగ్య అధికారిణి గాయత్రిలున్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
వికటించిన మధ్యాహ్న భోజనం


