భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ | - | Sakshi
Sakshi News home page

భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

భక్తు

భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ

బళ్లారిఅర్బన్‌: బళ్లారిలోని చారిత్రక కోటె మల్లేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నగరంలో రథోత్సవానికి తరలి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులకు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో రుద్రాక్షలు, విభూతిని పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మహాశివరాత్రి సందర్భంగా రుద్రాక్షలు, విభూతి పంపిణీ జరుగుతుండగా, గత రెండేళ్లుగా కోటె మల్లేశ్వర స్వామి రథోత్సవంలో లడ్డు ప్రసాదం, నీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది.

చిన్నారిపై వీధి కుక్క దాడి

హుబ్లీ: ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల మగబిడ్డను కుక్క కరిచి గాయపరిచిన ఘటన ధార్వాడ తాలూకా లకమాపుర గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పృథ్విక్‌ మూలెమని బాధిత బాలుడు. ఉదయం ఇంటి ముందు ఆటలాడుతుండగా వీధి కుక్క దాడి చేయడంతో బిడ్డ అరుపులు విన్న తల్లిదండ్రులు తక్షణమే బయటకు వచ్చి కుక్కను తరిమి కొట్టారు. అయితే ఆలోపే కుక్క బాలుడి చెవి, తలపై కరిచి గాయపరిచింది. చెవిలో ఓ భాగం బాగా కొరకడంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా గత వారంలో ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న లేఅవుట్‌లో ఓ పిచ్చికుక్క 9 మందిని కరిచిన సంగతి తెలిసిందే.

వైభవంగా యల్లమ్మ

పల్లకీ రథోత్సవం

రాయచూరు రూరల్‌: నగరంలోని జ్యోతి కాలనీలో వెలసిన ఉత్తిన యల్లమ్మ దేవి జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. దేవి విగ్రహానికి కిల్లె బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సోమవారపేట అభినవ రాచోటి శివాచార్య, ఉడుంగల్‌ మఠాధిపతి వీర సంగమేశ్వర శివాచార్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సోమవారం రాత్రి ఆలయం వద్ద అధ్యక్షురాలు రాజేశ్వరి వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నెరవేర్చారు. అనంతరం పల్లకీలో దేవి విగ్రహాలను ఊరేగించారు.

అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన

రాయచూరు రూరల్‌: అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్‌ చేసింది. మంగళవారం నగరంలోని టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్మినెంట్‌ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ దిిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనలో శరణ బసవ, గోకారమ్మ, వరలక్ష్మి, శ్యామల, ఇందిర, శరణమ్మ, శాంతమ్మ, మల్లికలున్నారు.

ఏపీఎంసీ ముట్టడి

రాయచూరు రూరల్‌: ఏపీఎంసీలో రైతులు పండించిన పంటలను, తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ రైతులు ఏపీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం రైతు సంఘం అధ్యక్షుడు సురేష్‌ మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు తెచ్చిన ఉల్లిగడ్డలను ఏపీఎంసీ అధికారులు ఉన్నఫళంగా కొనుగోలు చేయక పోవడంతో రైతులు సొమ్మసిల్లారు. ఏపీఎంసీ అధికారులు ఉల్లిగడ్డల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

భక్తులకు రుద్రాక్షలు,  విభూతి పంపిణీ1
1/3

భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ

భక్తులకు రుద్రాక్షలు,  విభూతి పంపిణీ2
2/3

భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ

భక్తులకు రుద్రాక్షలు,  విభూతి పంపిణీ3
3/3

భక్తులకు రుద్రాక్షలు, విభూతి పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement