ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్‌

Feb 11 2026 7:52 AM | Updated on Feb 11 2026 7:52 AM

ప్రజల

ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్‌

బళ్లారిటౌన్‌: స్వచ్ఛ భారత్‌కు నగర ప్రజల సహకారం అవసరమని మేయర్‌ పీ.గాదెప్ప పేర్కొన్నారు. నగరాభివృద్ధి శాఖ, మహానగర పాలికె ఆధ్వర్యంలో వాల్మీకి భవనంలో మంగళవారం చేపట్టిన స్వచ్ఛభారత్‌ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ యావత్‌ నగరాన్ని పాలికె నుంచి శుభ్రపరచడం సాధ్యం కాదన్నారు. నగరంలోని 39వ వార్డుల్లో ప్రజలు సహకరిస్తేనే పూర్తి స్థాయిలో స్వచ్ఛతను కాపాడవచ్చన్నారు. ఇంటిలోని చెత్తను సక్రమంగా వేరు చేసి చెత్త వాహనాలకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాలికె కమిషనర్‌ మంజునాథ్‌ మాట్లాడుతూ పిల్లలు బాల్య దశ నుంచే పరిశుభత్రపై అవగాహన పొందాలన్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా వారికి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్వచ్ఛభారత్‌పై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. పోటీల్లో దాదాపు 76 పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు, పాలికె సభ్యులు కుబేర, రాజేశ్వరి, జానకి, ఏఈఈ ముస్తఫా పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్‌1
1/1

ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement