అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
రాయచూరు రూరల్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపీడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ ఇరానీ ముఠాను కలబుర్గి పోలీసులు అరెస్ట్ చేశా రు. సోమవారం కలబుర్గి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారి శరణప్ప పాత్రికేయులకు వివరాలు వెల్లడించారు. నిందితులను మహారాష్ట్రలోని బీడ్ జిల్లా శివాజీ నగర్‌కు చెందిన అలీమీర్జా, జహీర్ అబ్బాస్ అలీ, రజాక్ బేగ్, థానే జిల్లా జాఫర్ అలీ అంబొవిలి, ఇందిరా నగర్ నివాసులు జాఫర్ ఆజమ్ సయ్యద్, లాల్ సమీర్ షేక్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఖాసీం జోజో జాఫ్రీలుగా గుర్తించారన్నారు. జనవరి 23న తావరగేర క్రాస్ వద్ద ముఖానికి ముసుగులు ధరించి అనుమానాస్పదంగా కలియ తిరుగుతూ వాహనదారులను భయపెట్టి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకున్న సమయంలో వారిని బంధించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.27.30 లక్షల విలువ చేసే 90 గ్రాముల బంగారం, టాటా ఫార్చునర్ కారు, హోండా మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ దోపిడీలకు పాల్పడినట్లు ఆయన వివరించారు.
ఏడుగురు నిందితుల పట్టివేత
రూ.27.30 లక్షల సొత్తు స్వాధీనం


