హంపీ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

హంపీ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

హంపీ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

హంపీ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

హొసపేటె: విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని ప్రదర్శించే ప్రపంచ ప్రసిద్ధ హంపీ ఉత్సవాలను వైభవంగా జరపడానికి జిల్లా యంత్రాంగం విస్తృతమైన సన్నాహాలు చేస్తోంది. ఈ సారి జిల్లా కేంద్రం హొసపేటె పట్టణం నుంచి హంపీ వరకు గ్రాండ్‌ విద్యుత్‌ దీపాల అలంకరణ ప్రధాన ఆకర్షణగా మారింది. పర్యాటకులను అబ్బురపరిచేందుకు జిల్లా యంత్రాంగం 50 కిలో మీటర్ల పొడవున విద్యుత్‌ దీపాలను ప్రారంభించింది. ఈ సారి హొసపేటె ప్రధాన రహదారులు కూడా విద్యుత్‌ దీపాలు వెలుగుల్లో, జిల్లాధికారి కార్యాలయం నుంచి హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయం వరకు ఉన్న రహదారి వెంట దీపాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు రోడ్డు నుంచి సాయిబాబా సర్కిల్‌ వరకు ఉన్న రహదారిపై రంగురంగుల విద్యుత్‌ దీపాలను అమర్చారు. రైల్వేస్టేషన్‌ రోడ్డు, సెంట్రల్‌ బస్టాండ్‌ రోడ్డు, బళ్లారి రోడ్డు వరకు లైట్లను ఏర్పరిచారు. అంబేడ్కర్‌ సర్కిల్‌, వాల్మీకి సర్కిల్‌, కనక సర్కిల్‌తో సహా కంప్లి రోడ్డు, కమలాపుర చెరువు పరిసరాల్ల విద్యుత్‌ దీపాలు ఎంతో ఆకర్షణగా ఉన్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్‌ దీపాల అమరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement