తండ్రి దెబ్బలకు కుమార్తె బలి | - | Sakshi
Sakshi News home page

తండ్రి దెబ్బలకు కుమార్తె బలి

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

తండ్రి దెబ్బలకు కుమార్తె బలి

తండ్రి దెబ్బలకు కుమార్తె బలి

యశవంతపుర: కుటుంబ, ఆస్తి కలహాలతో కూతురిని తండ్రి హతమార్చిన హృదయ విదారక ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో కాసరగోడు జిల్లా మంజేశ్వర తుమినాడిలో జరిగింది. జుమైలా (18)ని ఆమె తండ్రి ఫారూక్‌ హత్య చేశాడు. ఫారూక్‌ గతంలో దుబాయ్‌లో పనిచేసి ఇంటికి తిరిగివచ్చాడు. భార్య తాహెరా మధ్య ఆస్తి గొడవలున్నాయి, మంగళవారం ఉదయం కూడా రగడ పడ్డారు. ఫారూక్‌ భార్యను చితకబాదగా కుమార్తె జుమైలా గొడవను విడిపించడానికి వెళ్లింది. ఫారూక్‌ చేతిలోని కట్టెతో జుమైలా తల మీద బాదడంతో ఆమె గాయాలతో కుప్పకూలి చనిపోయింది. పోలీసులు ఫారూక్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement